Sunday, 28 April 2013

అస్సలు ప్రేమంటే ఏంటి ???

4 comments
అస్సలు ప్రేమంటే ఏంటి ???

మనం అది లేకుండా ఒక్క రోజైన ఉండగలమా ... ఎ ఒక్కరి గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా పడుకోగలమా ... కళ్ళు మూస్తే ఎన్నో ఆలోచనలు ... ఒక్కోసారి మనం వాళ్ళ ఆలోచనలు ఏంటో కూడా మనమే అలోచిస్తుంటాం .......
మనమే వాళ్ళ గురించి ఎక్కువగా ఊహించుకొంటాం .. మనకు తెలీకుండానే వాళ్ళ పైన ప్రేమను పెంచేసుకొంటాం .... వాళ్ళు మాట్లాడకపోతే ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్ మనమే create చేస్కోంటాం .. దీనికి కారణం నువ్వేనంటు మళ్ళి వాళ్ళ పైనే నెడుతాం ... మనకేం ఎరగనట్టు చిన్నబుచుకొంటాం ... వాళ్ళు మనకు నచ్చేటు ఉండాలని కోరుకొంటాం ...తన గురించి ప్రతిది మనకు తెలియాలని ఆశ పడుతాం ...
ఏదైనా మంచి పని చేసినప్పుడు కలిగే ఆనందం కన్నా అవతలి వాళ్ళ ప్రేమ నీకు దక్కిన ఆనందం ఎక్కువ కాలం సంతోషపెడుతుంది ... నువ్వు చెయ్యగలవ్ అని వెన్ను తట్టినప్పుడు మనం సాధించినంత సంతోషపడుతాం ..... ఎంత కష్టపడిన ఒకరి ప్రోత్సాహం లేనిదే ఎ పని చెయ్యాలనిపించదు ... ఎవరు ప్రోత్సాహం ఇవ్వకపోయినా క్రిటిక్స్ ఐన expect చేస్తాం ... చిన్న చిన్న ఆనందాలు ... అవి పంచుకొన్న తీపిగురుతులు ,ఎన్నో ఆటుపోట్లు ఎన్నెన్నో జీవితం నేర్పిన పాటాలు మనల్ని ముందుకు నేడుతాయి ...
చిన్న పిల్లల చిరునవ్వు ... స్వచ్చమైన తాత బామ ల ప్రేమ ... మనం చేసిన కొంటె పనులు ... చల్లని గాలి లో నచ్చిన సంగీతం వింటూ హమ్ చేస్తూ బీచ్ లో అలా మనల్ని ఇష్టపడే వ్యక్తులతో ఎంజాయ్ చేస్తూ గడిపిన కాలాలు ...మనకి అవి సమయం కూడా తెలీకుండా ఎంతో సంతోషపెడుతాయి ...

ప్రేమ అనేది నాకు తెలిసినంత వరకు ఎంత ఇస్తే అంత సంతోషంగా ఉంటాం ...
nenu-namanasu

Sunday, 7 April 2013

మీ సంతోషం మీ చేతుల్లో ..:)

4 comments



మనమేం ఓనర్స్ కాదు కదా ఫీలింగ్స్ ,worries ,reactions ,ఇలాంటి రకరకాల ఆలోచనలతో మనం happiness ని దూరం చేసుకొంటాం ... అవతలి వ్యక్తులకు ఎక్కువ importance ఇచ్చేసి ... వాళ్ళ గురించి ఆలోచిస్తూ మన importance ని మర్చిపోతున్నాం ... ఫీలింగ్స్ ,emotions .. కి ఎక్కువ importance ఇచ్చి వ్యక్తులను దూరం చెసుకొంటునామ్ ... అవేవో వాళ్ళకే వదిలేసి మన ఎప్పటిలా హ్యాపీ గా ఉంటే ఎంత బాగుంటుంది కదా ... ఎవరైనా క్లోజ్ గా ఉండి పొగిడితే పెద్దగా పట్టిచుకోకున్నా .. తిడితే మాత్రం తట్టుకోలెం ... ఎక్కడలేని ఏడుపు తన్నుకోస్తుంటుంది ... అంతలా మనం వాళ్లకి importance ఇచ్చి మనల్ని మనం తక్కువ  చేసుకొంటునాం .... ఆ pain ,emotions ,frustration ,అన్ని ఒక్కసారి మనల్ని తంతాయి ... హ్మ్మ్ ఇలా కొన్ని రోజులు బాధపడుతాం ... తర్వాత మళ్ళి మనల్ని మనమే ఓదార్చు కొంటాం .. .. లాస్ట్ కి అది   end లేని సీరియల్ లా సాగదీస్తాం ... తర్వాతా సారీ లు,ఫైట్ లు ,అన్ని మామూలే ... హ్మ్మ్ అవసరమా మనకి .. అందుకే వాళ్ళ ఫీలింగ్స్ వాళ్ళకే వదిలేసి మనకి మనం importance ఇచ్చుకొని ఎప్పటిలా వాళ్ళతో happy గా ఉంటే ఒక healthy relationship maintain చేయగలితే నీకంటే విలువైన వాళ్ళు ఎవరు ఉండరు .. మనల్ని కోల్పోతే వాళ్ళకే ఆ లోతు తెలుస్తుంది ... వదిలేయండి మీ బాధలు వాళ్ళకే :P ఒక్క చిన్న నవ్వుతో :) మళ్ళి happiness కి చేరువ కండి ... ఎందుకంటే ఆ తలుపు తాళం మీలో నే ఉంది ... ఇలాంటి తొక్కలో emotions గేటు ఓపెన్ చేసి అసలైన గేటు తెరవడం మర్చిపోతున్నాం :)
ఎవరు pain లోనే ఉండాలనుకోరుగా ultimate గా happiness నే కావాలనుకొంటారు ... సో మనం మిగితా గేటు ల keys అవతల పారేసి కేవలం నీలొఉన్న ఆ ultimate కీ ఓపెన్ చేసుకొంటే ఇంక నవ్వులే నవ్వులు :) నీ ఆనందం నీకు ముఖ్యం .. ఎవారో ఇచ్చిన sadness కాదు ... :)

మీ సంతోషం మీ చేతుల్లో .. దుఃఖం వారికే వదిలేద్దాం ... :P

nenu-namanasu

Total Pageviews

About me

My Photo
చిన్ని
ఎప్పుడూ నవ్వుతూ అందరిని నవ్విస్తూ...జీవితాన్ని ఆస్వాదిస్తూ...అందరిని అనందం తొ చూడాలనుకొనె తెలుగు అమ్మాయిని.......
View my complete profile





Recent Comments


Blogger Widgets

Labels

Flash Labels by Way2Blogging



nenu-namanasu. Powered by Blogger.


Translate

Popular Posts

haaram logo