స్వామీ వివేకానంద (జనవరి 12, 1863 - జూలై 4, 1902), (బెంగాలీలో 'షామీ బిబేకానందో') ప్రసిద్ధి గాంచిన హిందూ యోగి. ఇతని పూర్వ నామం నరేంద్ర నాథ్ దత్తా. రామకృష్ణ పరమహంస ప్రియ శిష్యుడు. వేదాంత, యోగ తత్త్వ శాస్త్రములలో సమాజముపై అత్యంత ప్రభావము కలిగించిన ఒక ప్రఖ్యాత ఆధ్యాత్మిక నాయకుడు. హిందూ తత్వ చరిత్ర, భారతదేశ చరిత్రలలోనే ఒక ప్రముఖ వ్యక్తి. రామకృష్ణ మఠం వ్యవస్థాపకుడు.
భారతదేశాన్ని జాగృతము చెయ్యడమే కాకుండా అమెరికా, ఇంగ్లాండుల లో యోగ, వేదాంత శాస్త్రములను తన ఉపన్యాసముల ద్వారా, వాదనల ద్వారా పరిచయము చేసిన ఖ్యాతి అతనికి కలదు. గురువు గారి కోరిక మేరకు అమెరికాకు వెళ్ళి అక్కడ హిందూ మత ప్రాశస్త్యం గురించి ఎన్నో ఉపన్యాసాలు చేశాడు. అతని వాగ్ధాటికి ముగ్ధులైన అమెరికా ప్రజానీకం బ్రహ్మరధం పట్టింది. ఎంతో మంది అతనికి శిష్యులయ్యారు. పాశ్చాత్య దేశాలలోకి అడుగు పెట్టిన మొదటి హిందూ సన్యాసి ఈయనే. తూర్పు దేశాల తత్త్వమును షికాగో లో జరిగిన ప్రపంచ మత జాతర (పార్లమెంట్ ఆఫ్ వరల్డ్ రెలిజియన్స్)లో 1893 లో ప్రవేశపెట్టాడు. అక్కడే షికాగోలోను, అమెరికాలోని ఇతర ప్రాంతాలలోను ప్రజల అభిమానాన్ని చూరగొన్నాడు.తిరిగి భారత దేశం వచ్చి రామకృష్ణ మఠాన్ని స్థాపించి దీని ద్వారా భారత యువతకు దిశా నిర్దేశం చేశాడు. ముప్పై తొమ్మిధి ఏళ్ళ వయసు లోనే మరణించాడు. ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆయన జన్మ దినాన్ని "జాతీయ యువజన దినోత్సవం" గా ప్రకటించింది.
ముఖ్య సూత్రములు తత్త్వములు
వివేకానందుడు గొప్ప తాత్వికుడు. అతని ముఖ్య బోధనల ప్రకారం అద్వైత వేదంతము తత్త్వ శాస్త్రములో నే కాకుండా , సామాజికంగా రాజకీయంగా కూడా ఉపయోగ పడుతుంది. రామకృష్ణుడు నేర్పిన ముఖ్యమైన పాఠాలలో 'జీవుడే దేవుడు' అనేది అతని మంత్రముగా మారింది. 'దరిద్ర నారాయణ సేవ' (పేదవారి సేవ తో భగవంతుని సేవ) అనే పదాన్ని ప్రతిపాదించాడు. "విశ్వమంతా బ్రహ్మం నిండి ఉండగా మనము మనని గొప్ప వారని తక్కువ వారని ఎలా అనుకుంటాము?" అనే ప్రశ్న తనకు తాను వేసుకుని ఈ తేడాలన్నీ మోక్షము సమయములో కలిగే దివ్యజ్యోతి లో కలిసి పోతాయని తెలుసుకున్నాడు. అప్పుడు పుట్టే ప్రేమ నుండి, తమలోని బ్రహ్మాన్ని తెలుసుకోలేని మనుష్యులను ఆదుకునే సత్ప్రవర్తన పుడుతుంది.అందరు తనవార నుకుంటేనే నిజమైన స్వేచ్ఛ లభిస్తుందనే వేదాంత తత్వానికి చెందిన వ్యక్తి వివేకానందుడు. వ్యక్తిగత మోక్షము పై వ్యామోహము ను కూడా వదిలివేసి, ఇతరులను బంధవిముక్తులను చెయ్యడమే మనిషికి జ్ఞానోదయము అని నమ్మిన మనిషి. రామకృష్ణా మిషన్ (రామకృష్ణా మఠము)ను "వ్యక్తి మోక్షమునకు, ప్రపంచ హితమునకు"(आत्मनॊ मोक्षार्थम् जगद्धिताय च) అనే నినాదము మీదస్థాపించాడు.
- సిద్ధాంతాలు, పిడివాదాలు, సంప్రదాయాలు, దేవాలయాలు మున్నగువాటిని గురించి ఆలోచించకు. మనిషి హృదయంలో దీపిస్తూన్న ఆత్మ వస్తువుతో సరిపోల్చితే అవి ఎందుకూ కొరగావు. ఆ వస్తువే ఆధ్యాత్మిక శక్తి. మొదట ఈ శక్తిని సముపార్జించండి. ఇతర ధర్మాలను నిందించవద్దు. ప్రతి మతంలోను, ప్రతి సిద్ధాంతంలోను, ఎంతోకొంత మంచి వుంటుంది.సోదర ప్రేమ గురించి ప్రసంగాలుమాని, ఆ ప్రేమను కార్యరూపంలో ప్రదర్శించండి.త్యాగ, సాక్షాత్కారాలను పొందినవాడే ప్రపంచంలోని సర్వమతాలలోని ఏకత్వాన్ని దర్శించగలడు. వ్యర్థ వాదాలకు ఆస్కారం లేదని గ్రహింపగలడు. అపుడే మానవాళికి సహాయం చేయగలడు. వాస్తవానికిఅన్నమతాలు ఒకే సనాతన ధర్మంయొక్క అంశాలు.
A man of intellect can turn into a devil, but never a man of heart
== Swami Vivekananda ==
Everything can be sacrificed for truth, but truth can’t be
sacrificed for anything.
The secret of life is not enjoyment, but education through experience.
If you love God’s creation more than God, you will be disillusioned.
In a day if you don’t come across any problems-
You can be sure that you are travelling in a wrong path
We want the education by which character is formed,
strength of mind is increased, the intellect is expanded,
and by which one can stand on one’s own feet.
Renunciation is the withdrawal of mind from other things and concentrating it on God.
Never think there is anything impossible for the soul.
In this short life there is no time for the exchange of compliments.
It is the greatest heresy to think so.
If there is sin,
this is the only sin; to say that you are weak,
or others are weak.
==Swami Vivekananda==
The greatest sin is fear.
If it is impossible
Arrow goes forward only after pulling in to backward.
to attain
perfection here
and now, there
is no proof that
we can attain
perfection in
any other life.
Bullet goes forward only after pressing the Trigger backward.
Such that.
Every human being will get happy only after facing the difficulties in their life path..
So don’t afraid to face your difficulties.
They will push you forward.
7 comments:
Gd Article.Especially his rare photographs.
thank u so much balu..:))
Really inspiring!..tanQ chinni for sharing this gr8 article:)
thanQ krijay :))
మరి ఇన్ని గొప్పభావాలు గల స్వామీ వివేకానందాగారు చుట్టలు తాగకపోతే, తాబేళ్ళు, షాడ్ చేపలు తినక పోతే బ్రతకలేని స్థితికి ఎందుకు వచ్చారు. అమెరికన్ స్త్రీలను నా వ్యక్తిగత నిర్వహణ కొరకు తలా వంద డాలర్లు వేసుకోమని ఎందుకు అడుక్కున్నారు. నా నరాలన్నీ వేడెక్కి ఉన్నాయి అని క్రిష్టీనా గ్రీన్ స్టైడల్ అనే యువతికి లేఖ ఎందుకు వ్రాసారు. మీకు ఓపిక ఉంటే ఆయన సంపూర్ణ రచనలను శ్రధ్ధగా చదవండి. లేదా vivekanandayb.blogspot.com లో నేను ఎంతో కష్టపడి వ్రాసిన ౨౭౪ బ్లాగులు చదవండి. తెల్లని వన్నీ పాలు, నల్లని వన్ని నీళ్ళు అనుకునే వయసు మీది. కానీ ఈప్రపంచం భిన్మమైనది. ఇట్లు వైబీరావు అనే గాడిద.
ఇతరులకు జ్ఞానోదయం చేయబోయే ముందు తనకు జ్ఞానోదయం కావాలి కదా. అది జరిగే లోగానే అయన అస్తమించారు కదా.
ఇతరులకు జ్ఞానోదయం చేయబోయే ముందు తనకు జ్ఞానోదయం కావాలి కదా. అది జరిగే లోగానే అయన అస్తమించారు కదా.
Post a Comment