స్కూల్ లో ఉన్నప్పుడు ......ఎప్పుడు ఆటలే ఈ వేదవ కి అంటారు ......
కాలేజీ .......ఏరా చదువు మానేసి పొద్దస్త మా నం ఆ క్రికెట్ పెట్టి ఎం సాదిస్తావురా ...
ఎదవ దేబ్యం పేస్ నువ్వు...
కాలేజి ...అయిపోయాక....ఏరా ఇంకా ఉద్యోగం రాలేదా ....ఐన నీకు ఉద్యోగ మిచ్చె ఎదవలు లేరు ఇక్కడ అంటారు ....
ఏదో కస్టపడి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తే........ఒరేయ్ నువ్వు ఎంత కష్టపడినా.....నీకు ఉద్యోగాలు కాసుకొని కుర్చోవట్లేడురా అంటారు.....
ఉద్యోగం వచ్చాక........ఏరా ఉద్యోగం ఒచిందంట ....ఇంక పెళ్ళెప్పుడు అంటారు....
సరే పెళ్లి కి రెడీ ఐపోయి.....ఒప్పెస్కుంటే .....ఏంట్రా అంత తొందర అంటారు....
పెళ్ళయ్యాక........పిల్లలు లేరా ఇంకా ....అంటారు ...
పిల్లలు ఎక్కువైతే...ఏమ్రో ....ఇండియా population తెగ పెంచేస్తునావ్ గా అంటారు....
బయటికెళ్తే ...మీ పిల్లలు మా పిల్లల పై రాళ్లు రువ్వుతున్నా రంట....కాస్త చేపురా అంటారు....
ఇంట్లో కూర్చుంటే.....ఎం ఈ నడుమ అస్సలు కనిపించట్లేదు అంత బిజీ ఐపొయావా అంటారు....
సినిమా కెళ్తే ..తెగ ఎంజాయ్ చేస్తునావ్ ఏంటి కథ....ప్రమోషన్ గాని వచ్చిందా అంటారు....
బయట బొంచేస్తే ఎంటండి ఈనడుమ ఎక్కువగా బయట తింటునారు ...ఇంట్లో ఏమైనా గొడవలా అంటారు...
అస్సలు బయట బొంచేయక పోతే...పిసినారి...ఒక్క పైసా కర్చుపెటరు అంటారు...
ఇలా చెప్పుకొంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో....
హ్మ్మ్ ....వీళ్ళు మారరు ....
ఒకడు సంతోషం గ ఉంటె ఓర్వలేరు ...వాళ్ళు సంతోషం గా ఉండరు......
అయినా ఏమిటో.....ఈ ఎనలేని ఆనందం...అవతలి వాళ్ళని వేదించాలంటే ....
ఓరినాయనో....ఇదెక్కడి గొడవరా బాబు అని మాట్లాడం మానేస్తే......ఏవిటండి...అస్సలు ఒక మాట లేదు...నవ్వులేదు.. ప్రాబ్లం లో ఉన్నట్టునారు..హ్మ్మ్ అని చిన్నగా నవ్వేసి పొతే....ఏమి చెప్పరు అన్ని మనసులోనే దచేసుకొంటారు సుమా ......
అన్ని అనేసుకోన్నాక.....మేమేంటి నీకు చెప్పేది....చెప్పినా నువ్వు నమ్ముతావ...
ఛి ఎదవ జీవితం అనక మారరు ...:P
...వీలైతే కాస్త నవ్వండి....ఇంకా వీలైతే కాస్త నవ్వుని పంచండి ...అంతే గాని ఇలాంటి తింగరి questions వేస్తె మటుకు...నష్టపోయేది మీరే.....
ఎందుకంటే.......ఎపుడో ఒక్కప్పుడు అనిస్పిస్తుంది ....అరె నా జీవితం లో ఏమి చేసానురా అని ఎనకాల తిరిగి చుస్కుంటే ...మొత్తం ఆన్సర్ లేని questions అడిగి మిమ్మల్నిమీరు...ఆన్సర్స్ కోసం అన్వేషిస్తున్న వ్యక్తిగానే మిగిలిపోతారు......:P
మీ అందమైన నవ్వు కోల్పోతారు...
0 comments:
Post a Comment