పూర్వకాలం లో నువ్వెవరివి అని అడుగుతే ...
నేను మంచివాడిని..
నేను ధ ర్మాత్ముడి ని ...
ఇలా కొన్ని మంచి సమాధానాలే వస్తాయి'
అదే ప్రశ్న ఈ కలం లో అడిగితె ...
నువ్వెవరివి???/(వారి మనస్సు)
నేను మోసగాడిని...
నేను ప్రజల సొమ్ము దోచుకొనే దౌర్బగ్యుడిని ...
నేను దొంగను....పేదల సొమ్ము కూడా ఊర్చి తినేసే దొంగ వెదవని ...
నేను వృతి కి ద్రోహం చేస్తూ..నాదేగ్గర వచ్చే అమాయకులను...మోసం చేస్తూ...డబ్బులు లాక్కునే వెదవ నికృష్టపు పనికిమాలిన వాడిని...
నేను అమ్మాయి కనిపిస్తే....వేదించే శాడిస్ట్ ని.....
నేను కోడలిని కట్నం కోసం హింసించే గయ్యాలిని ...
నేను తాగొచ్చి తప్పుచేసిన చెయ్యకున్నా బార్యను కొట్టే వెర్రి వెధవను ...
నేను పాపిష్టి సొమ్ము కు అలవాటు పడి ఎటు వంటి పనికిమాలిన పని నైన చేసే కుర్ర కుంకను ...
నాకు తెలిసిందల్లా డబ్బు...అది చేతికందుతే చాలు...ఎవ్వరు ఏమైపోతే నాకేంటి ...ఎవరు ఎటు పోతే నాకేంటి.....
నా ద్రుష్టి లో మనిషి కి వాల్యూ లేదు....మనీ కి తప్ప ....
ఎక్కడ మనీ ఉంటె అక్కడ నేనుంట ....
అవసరానికి మంచి,దైవం,త్యాగం ....ఇలాంటి మాస్కులు వేస్తూ అందరిని మోసం చేస్తుంట .....
ఇలాంటి సమాధానాలు వాళ్ళ మనసు చేపుతుంటాయి ...కాని వాళ్ళు అదే వారని మోసo చేసుకొంటున్నారు
హ్మ్మ్ ....అక్కడ నువ్వు ఉన్నావు అనుకొంటూ గడిపెస్తునావ్....కాని....నిన్ను నువ్వు ఇలాంటి మాస్కులతో మూసేసి నిన్ను నువ్వు మోసం చెసుకొంటు....మనీ కి బానిసై ...ఎవరు ఎక్కడ పట్టుకొని పోతారో అని బిక్కు బిక్కు మంటూ కాలం వేలదీస్తునావ్ .....నీకు నువ్వు వెల కట్టుకొంటునావ్ ,,,,,..........
ఆత్మీయతలు...అనురాగాలు....బందాలు ...అనుబందాలను దూరం చేసుకొంటూ....
నీ అందమైన చిరునవ్వుకు దూరం అవుతున్నావు ........నిన్ను నువ్వు కోల్పోతున్నావ్ ......